మనిషి కడుపులో ఇనుప వస్తువులు

Tue,June 18, 2019 10:37 AM

doctors remove 80 metal objects from mentally ill patient

జైపూర్‌ : ఓ మానసిక రోగి కడుపులో ఉన్న ఇనుప వస్తువులను చూసి వైద్యులు షాక్‌కు గురయ్యారు. 90 నిమిషాల పాటు వైద్యులు శస్త్రచికిత్స చేసి సుమారు 80 ఇనుప వస్తువులను తొలగించారు. ఉదయ్‌పూర్‌కు చెందిన ఓ మానసిక రోగికి కడుపు నొప్పి వచ్చింది. దీంతో రోగి కుటుంబ సభ్యులు అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతనికి ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు. కడుపులో ఉన్న ఇనుప వస్తువులను చూసి వైద్యులు షాక్‌కు గురయ్యారు. తాళం చెవిలు, చైన్స్‌తో పాటు ఇతర మెటల్స్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో నలుగురు డాక్టర్ల బృందం 90 నిమిషాల పాటు శస్త్రచికిత్స చేసి ఆ వస్తువులను తొలగించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు.

1641
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles