682 లింగ మార్పిడి సర్జరీలు చేసిన డాక్టర్

Thu,December 20, 2018 12:52 PM

మైసూర్ : బెంగళూరుకు చెందిన ఓ మహిళా డాక్టర్ 682 లింగ మార్పిడి సర్జరీలు చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 16 ఏళ్ల బాలుడు అదృశ్యమైనట్లు అతడి అమ్మమ్మ మాండ్యా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదృశ్యమైన బాలుడు అక్టోబర్ నెలలో ట్రాన్స్ జెండర్ వేషధారణలో కేఆర్ పెట్ సర్కిల్ లో ఉండగా అతడిని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది.

నాకు బ‌ల‌వంతంగా లింగ మార్పిడి స‌ర్జ‌రీ చేశారు

బాలుడిని పోలీసులు విచారించగా.. బలవంతంగా కొంతమంది ట్రాన్స్ జెండర్లు తనను వారి కమ్యూనిటీలో చేర్చుకున్నారని తెలిపాడు. జూన్ నెలలో 19 ఏళ్లు ఉన్నట్లు ఓ బోగస్ సర్టిఫికెట్ తయారు చేసి బెంగళూరులోని ఓ మహిళా డాక్టర్ లింగ మార్పిడి చేసినట్లు చెప్పాడు. దీంతో పోలీసుల బృందం మహిళా డాక్టర్ ను విచారించగా.. గత మూడేళ్లలో 682 మందికి లింగ మార్పిడి సర్జరీలు చేసినట్లు తేలింది. అయితే డాక్టర్ ను విచారిస్తున్న సమయంలో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. డాక్టర్ ను కస్టడీలోకి తీసుకొని విచారిస్తామని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు ట్రాన్స్ జెండర్లను, లింగ మార్పిడి చేయించుకుంటున్న మరో ముగ్గురితో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

3103
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles