ఆత్మహత్యకు కారణమైన నాన్ వెజ్

Fri,January 12, 2018 05:01 PM

Doctor Gupta kills self after over eating meat in Lucknow

లక్నో : మాంసాహారం.. ఆత్మహత్యకు కారణమైంది. తను తినడమే కాకుండా బిడ్డకు నాన్ వెజ్ తినిపించినందుకు భార్య గొడవ పడటంతో ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన లక్నోలోని గోమాతి నగర్‌లో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. డాక్టర్ ఉమా శంకర్ గుప్తా(43), దీప్తి అగర్వాల్ భార్యాభర్తలు. వీరికి ఆరేళ్ల కూతురు ఆరాధ్య ఉంది. గుప్తా స్కిన్ స్పెషలిస్ట్ కాగా, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా దీప్తి పని చేస్తోంది. అయితే గుప్తా మాంసాహార ప్రియుడు. దీప్తి మాత్రం కేవలం శాఖాహారి. బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో గుప్తా.. నాన్ వెజ్ ఆహారాన్ని ఇంటికి తీసుకువచ్చాడు. అప్పటికే నిద్ర పోయిన తన కూతురు ఆరాధ్యను లేపి.. ఇద్దరూ కలిసి నాన్ వెజ్ తిన్నారు. గుప్తా తినడమే కాకుండా ఆరాధ్యకు మాంసం తినిపించడంతో దీప్తి తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవ చోటు చేసుకుంది. తీవ్ర మనస్తాపానికి గురై డాక్టర్ గుప్తా అదే రోజు రాత్రి తన గదిలోకి వెళ్లి ఉరేసుకున్నాడు. అర గంట అయినప్పటికీ కూడా తన భర్త బయటకు రాకపోవడంతో తెలిసిన వారికి సమాచారం అందించింది. మొత్తానికి గుప్తా తలుపులు విరగొట్టి చూడగా.. అతడు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

2901
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS