కరుణ మృతికి నివాళిగా గుండు గీయించుకుంటున్న అభిమానులు

Wed,August 8, 2018 01:20 PM

DMK supporter gets his head tonsured as mark of respect for Karunandhi in Coimbatore

చెన్నై : డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతితో డీఎంకే కార్యకర్తలు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కరుణానిధి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. కోయంబత్తూరులో కొంతమంది అభిమానులు, మద్దతుదారులు.. కరుణానిధి మృతికి నివాళిగా గుండు గీయించుకుంటున్నారు. తమిళనాడు ప్రజలు ఒక మంచి నాయకుడిని కోల్పోయారని పలువురు కొనియాడుతున్నారు. కరుణానిధిని కడసారి చూసేందుకు చెన్నైలోని రాజాజీ హాల్‌కు భారీ సంఖ్యలో ఆయన అభిమానులు తరలివస్తున్నారు. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభం కానుంది.1180
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles