డీఎంకే ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ: స్టాలిన్‌

Mon,September 16, 2019 08:03 PM

చెన్నై: కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలకు తలొగ్గేది లేదనీ డీఎంకే అధినేత ఎం. కే. స్టాలిన్‌ అన్నారు. ఇటీవల కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌ షా చేసిన ఒకే దేశం ఒకే భాష అనే నినాదంపై తమిళులు భగ్గుమంటున్నారు. ఈ సందర్భంగా డీఎంకే పార్టీ హై లెవెల్‌ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని స్టాలిన్‌ మీడియాకు తెలిపారు.


కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆధిపత్య నిర్ణయాలను ఎప్పటికీ స్వాగతించబోము. కేంద్రానికి వ్యతిరేకంగా డీఎంకే ఆధ్వర్యంలో ఈ నెల 20న 10 గంటలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల హెడ్‌ క్వార్టర్స్‌లో భారీ ర్యాలీ నిర్వహించనున్నామనీ, హిందీ భాషను తమిళనాడులో బలవంతంగా చొప్పిస్తామంటే ఊరుకునేది లేదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


761
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles