తిరువారూర్ ఉప ఎన్నికలో స్టాలిన్ పోటీ?

Tue,January 1, 2019 03:43 PM

DMK leaders want Stalin to contest father Karunanidhis Thiruvarur seat,

చెన్నై: తమిళనాడులోని తిరువారూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. గతేడాది ఆగస్టు 7న డీఎంకే నేత, తిరువారూర్ ఎమ్మెల్యే కరుణానిధి మరణంతో ఆ సీటు ఖాళీ అయింది. సిట్టింగ్ స్థానం దక్కించుకోవడానికి డీఎంకే పట్టదలతో ఉంది. ఈ నేపథ్యంలో స్టాలిన్ పోటీచేయాలంటూ ఆ పార్టీ సీనియర్లు, నేతలు ఒత్తిడి తెస్తున్నారు.

తండ్రి స్థానం కావడం, సులువుగా గెలిచే సీటు కావడంతో ఇక్కడి విజయంతో రానున్న ఎన్నికల్లో సత్తాచాటాలని భావిస్తోంది. అక్కడ గెలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపవచ్చని సీనియర్ నేతలు ఆశిస్తున్నారు. ప్రస్తుతం డీఎంకే చీఫ్ స్టాలిన్ చెన్నైలోని కోళత్తూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. స్టాలిన్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

1443
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles