పుదుచ్చేరి మాజీ సీఎం జానకీరామన్ కన్నుమూత

Mon,June 10, 2019 10:17 AM

DMK leader and former CM of Puducherry RV Janakiraman passed away in Puducherry

హైదరాబాద్ : డీఎంకే నాయకుడు, పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి ఆర్‌వీ జానకీరామన్(78) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జానకీరామన్ మృతిపట్ల పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, డీఎంకే నాయకులు సంతాపం ప్రకటించారు. డీఎంకే తరపున ఆయన 1985లో తొలిసారిగా నెల్లితోపే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పుదుచ్చేరి సీఎంగా 1996 నుంచి 2000 వరకు సేవలందించారు. 1989 -1991 మధ్య కాలంలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మినిస్టర్‌గా పని చేశారు. 1990, 1991, 1996, 2001లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2006, 2011లో జానకీరామన్ ఓటమి చవిచూశారు.

790
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles