ప‌ళ‌నికి వ్య‌తిరేకంగా డీఎంకే, కాంగ్రెస్‌ ఓటుFri,February 17, 2017 06:51 PM
ప‌ళ‌నికి వ్య‌తిరేకంగా డీఎంకే, కాంగ్రెస్‌ ఓటు

చెన్నై: త‌మిళ‌నాడు అసెంబ్లీలో శ‌నివారం జ‌ర‌గ‌నున్న బ‌ల‌ప‌రీక్ష‌లో సీఎం ప‌ళ‌నిస్వామికి వ్య‌తిరేకంగా ఓటు వేయ‌నున్న‌ట్లు డీఎంకే పార్టీ స్ప‌ష్టం చేసింది. డీఎంకే పార్టీలో మొత్తం 89 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవాళ త‌మ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో స‌మావేశ‌మైన ఎమ్మెల్యేలు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. డీఎంకేకు తోడుగా కాంగ్రెస్ కూడా ప‌ళ‌నికి వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ది. కాంగ్రెస్‌కు త‌మిళ‌నాడులో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బ‌ల‌ప‌రీక్ష‌లో ప‌ళ‌ని గ‌ట్టెక్కాలంటే ఆయ‌న‌కు అనుకూలంగా క‌నీసం 118 ఓట్లు ప‌డాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం త‌మ బృందంలో 124 మంది ఎమ్మెల్యేలు ఉన్న‌ట్లు ప‌ళ‌ని గ‌వ‌ర్న‌ర్‌కు లేఖ స‌మ‌ర్పించిన విష‌యం తెలిసిందే. అన్నాడీఎంకేకు చెందిన మ‌రో ప‌ది మంది ఎమ్మెల్యేలు మాజీ సీఎం ప‌న్నీరు సెల్వం శిబిరంలో ఉన్నారు. రేపు జ‌రిగే బ‌ల‌ప‌రీక్ష‌కు అంద‌రూ హాజ‌రుకావాల‌ని డీఎంకే , కాంగ్రెస్ పార్టీలు త‌మ ఎమ్మెల్యేల‌కు ఆదేశాలు జారీ చేశాయి.

2172
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS