బెయిల్‌పై విడుదలైన డీకే శివకుమార్‌..

Wed,October 23, 2019 10:58 PM

న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌ డీకే శివకుమార్‌ నేడు బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా శివకుమార్‌ మాట్లాడుతూ.. అందరి ఆశీస్సులతో నాకు బెయిల్‌ లభించింది. జైల్‌ల్లో ఉన్నపుడు మానసికంగా కృంగిపోయాను. చేయని నేరానికి అనవసరంగా జైల్లో వేశారని మధనపడ్డాను. కానీ, ఈ సమయంలో నాకు అండగా నిలిచిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. శివకుమార్‌ మాట్లాడుతున్నపుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కాగా, మనీ లాండరింగ్‌ కేసులో డీకే శివకుమార్‌ను ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) అరెస్టు చేసిన విషయం తెలిసిందే.445
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles