దీపాలతో వెలిగిపోయిన దేశం

Thu,November 8, 2018 06:32 AM

Diwali illuminates India

ఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ఆంనందోత్సాహాలతో సుప్రీంకోర్టు ఆంక్షల మధ్య జరుపుకున్నారు. మిత్రులు, బంధువుల ఇండ్లకు వెళ్లి మిఠాయిలు పంచుకుని దీపావళి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సోషల్ మీడియాలో, ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్‌లలో శుభాకాంక్షలను షేర్ చేసుకున్నారు. దేశ అధ్యక్షులు రామ్‌నాథ్‌కోవింద్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పండుగ ఆంనందం పంచుకుంటూనే కాలుష్య రహిత సురక్షిత దీపావళి జరుపుకోవాలని పిలుపునిచ్చారు. భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అనేది దేశ పౌరులందరూ సోదరభావం, ఐక్యతను పెంచేందుకు జరుపుకుంటాం. దీపావళి మన దేశ ప్రజలందరి జీవితాల్లో చికట్లు తొలగి వెలుగు నింపాలని ఆంకాంక్షించారు.

ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారమన్, ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌లు భారత్ - చైనా సరిహద్దులో డ్యూటీలో ఉన్న ఐటీబీపీ సిబ్బందిని సైనికులను కలుసుకుని వారికి శుభాకాంక్షలు తెలిపారు. సిబ్బందికి మిఠాయిలు పంచి పండుగను జరుపుకున్నారు.

అయితే రాత్రి 8 కాక‌ముందే ఆకాశం అంతా క్రాక‌ర్స్‌తో క‌ళ‌క‌ళ‌లాడింది. దీప‌కాంతుల మ‌ధ్య ప‌టాకుల శ‌బ్ధాలు మారుమోగాయి. మ‌రి సుప్రీం.. త‌న‌ దీపావ‌ళి తీర్పును సుప్రీంకోర్టు స‌మీక్షిస్తాందా లేదా వేచి చూడాల్సిందే.

2344
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles