దివాళీ ధమాకా.. కార్లపై భారీ డిస్కౌంట్లు

Thu,October 12, 2017 02:20 PM

Diwali Bonanza for car buyers as companies offer big discounts

ముంబై: పండుగలకు కొత్తగా బైక్‌లు, కార్లు కొనాలని చాలా మంది అనుకుంటారు. అందులోనూ దీపావళికి కార్లకు క్రేజ్ ఎక్కువే. అందుకే అన్ని టాప్ కంపెనీలు భారీ డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో నడుస్తున్న టాప్ బ్రాండ్స్ కార్లలో కొన్నింటిపై మంచి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని చూసి ఏ కారు కొనాలో మీరే డిసైడ్ చేసుకోండి..

ఆల్టోపై రూ.40 వేల వరకు డిస్కౌంట్
ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన కారు. మిడిల్‌క్లాస్ ఫేవరెట్ కారిది. ఈ దీపావళికి మారుతి సుజుకీ ఈ మోడల్‌పై రూ.40 వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నది. ఆల్టో 800పై రూ.20 వేల క్యాష్ డిస్కౌంట్, ఆల్టో కే10పై రూ.పది వేల డిస్కౌంట్.. ఈ రెండు మోడల్స్‌పై ఎక్స్‌చేంజ్ బోనస్ కింద రూ.20 వేలు ఇస్తున్నది.

హోండా బీఆర్-వీపై రూ.1.3 లక్షల వరకు డిస్కౌంట్
ఎస్‌యూవీల్లో మారుతి బ్రెజా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌కు పోటీగా ఉన్న హోండా బీఆర్-వీ దివాళీకి భారీ డిస్కౌంట్ ప్రకటించింది. నేరుగా ఈ మోడల్‌పై రూ.లక్ష క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. అంతేకాదు.. ద గ్రేట్ హోండా ఫెస్ట్ పేరుతో తొలి ఏడాదికి ఇన్సూరెన్స్, ఇతర ఆఫర్లు కూడా ఇస్తున్నది హోండా.

మారుతి సుజుకి సియాజ్‌పై రూ.90 వేల వరకు డిస్కౌంట్
మారుతి సుజుకీ ప్రిమియం మోడల్ అయిన సియాజ్‌పై రూ.90 వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నది. రూ.40 వేలు క్యాష్ డిస్కౌంట్ కాగా.. ఎక్స్‌చేంజ్ బోనస కింద రూ.50 వేల వరకు ఉంటుంది. అయితే కేవలం డీజిల్ మోడల్‌పైనే ఈ ఆఫర్ ఉంటుంది.

హోండా అమేజ్‌పై రూ.50 వేల డిస్కౌంట్
హోండాలోనే మరో మోడల్ అయిన అమేజ్‌పై కూడా రూ. 50 వేల వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. ఇందులో తొలి ఏడాది ఇన్సూరెన్స్, రూ.26 వేల విలువైన యాక్సెసరీస్ ఉన్నాయి. కొందరు డీలర్స్ క్యాష్ డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు.

రెనాల్ట్ డస్టర్‌పై రూ.60 వేల వరకు డిస్కౌంట్
రెనాల్ట్ డస్టర్‌పై రూ.10 వేల క్యాష్ డిస్కౌంట్, 2 గ్రాముల గోల్డ్ కాయిన్ ఇవ్వనున్నారు. గోల్డ్ కాయిన్ వద్దనుకుంటే రూ.6 వేలు ఇస్తారు. ఇవి కాకుండా 7.99 శాతం వడ్డీతో లోన్, రూ.1కే ఇన్సూరెన్స్, రూ.పది వేల ఎక్స్‌చేంజ్ బోనస్, అదనంగా రూ.7 వేల కార్పొరేట్ బోనస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఫోక్స్‌వాగన్ పోలోపై రూ.50 వేల వరకు డిస్కౌంట్
ఫోక్స్‌వాగన్ తమ ప్రీమియం హాచ్‌బ్యాక్ కార్ పోలోపై డిస్కౌంట్లు ఉన్నాయి. కంఫర్ట్‌లైన్ పెట్రోల్, డీజిల్ వెర్షన్లపై రూ.25 వేల వరకు, హైలైన్ వేరియెంట్‌పై రూ.50 వేల వరకు ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

డాట్‌సన్ రెడీ గోపై రూ.50 వేల వరకు డిస్కౌంట్
రెనాల్ట్ క్విడ్‌కు పోటీగా వచ్చిన డాట్‌సన్ రెడీ గో అంతగా ఆకర్షించలేకపోయింది. దీంతో ఈ దివాళీకి దీనిపై ఆఫర్లు ప్రకటించింది ఆ కంపెనీ. రూ.15 వేల క్యాష్ డిస్కౌంట్, ఫ్రీ ఇన్సూరెన్స్, రూ.19 వేల వరకు ఇతర ఆఫర్లు ఇస్తున్నది.

2660
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS