ఐశ్యర్యతో విడాకులు ఇప్పిస్తేనే ఇంటికి తిరిగొస్తా!

Fri,November 9, 2018 05:36 PM

Divorce seeking Tej Pratap Yadav says will not return home until family backs his demand

హరిద్వార్: అసలే దాణా కేసుల్లో ఇరుక్కొని జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఆయన తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ భార్య నుంచి విడాకులు కోరుతున్నారు. పెళ్లయి ఆరు నెలలు కూడా పూర్తి కాకుండానే ఆయన విడాకులు అడగడం గమనార్హం. అయితే లాలూతోపాటు ఆయన కుటుంబ సభ్యులు దీనికి అంగీకరించడం లేదు. దీంతో తేజ్ ప్రతాప్ ఇల్లు వదిలి హరిద్వార్ వెళ్లారు. విడాకులు ఇప్పిస్తేనే తాను తిరిగి ఇంటికి వస్తానని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఆర్జేడీ ఎమ్మెల్యే చంద్రికా రాయ్ కూతురు, బీహార్ మాజీ సీఎం దరోగా ప్రసాద్ రాయ్ మనవరాలు ఐశ్వర్యరాయ్‌తో ఈ ఏడాది మే 12న తేజ్‌ప్రతాప్ పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. అయితే కొన్నాళ్లకే వీళ్ల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అవి సమసిపోయే అవకాశమే లేదని తేజ్ ప్రతాప్ చెబుతున్నారు. నిజానికి పెళ్లికి ముందే విభేదాలు రావడంతో అప్పుడే ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పానని, వాళ్లు పట్టించుకోకుండా పెళ్లి చేశారని ఆయన చెప్పారు. ఇప్పుడు విడాకులకు వాళ్లు అంగీకరించకపోతే తాను ఎలా ఇంటికి తిరిగి వస్తానని తేజ్ ప్రతాప్ ప్రశ్నిస్తున్నారు. అయితే తేజ్ ప్రతాప్ విడాకులు కోరడంపై లాలూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

4475
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles