ఈసీ స‌భ్యుల్లో భిన్నాభిప్రాయాలు.. క్లారిటీ ఇచ్చిన‌ సునిల్ అరోరా

Sat,May 18, 2019 01:50 PM

diversion of views will be there in EC, says CEC Sunil Arora

హైద‌రాబాద్: కేంద్ర ఎన్నిక‌ల సంఘంలో అంత‌ర్గ‌త విభేదాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. స‌భ్యుల్లో ఒక‌రైన అశోక్ ల‌వాసా .. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్వ‌హ‌ణ తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ల‌వాసా ఈనెల 16వ తేదీన చీఫ్ క‌మిష‌న‌ర్‌కు సునిల్ అరోరాకు లేఖ కూడా రాశారు. ఎన్నిక‌ల నియ‌మావ‌ళి అంశంలో ఈసీ అధికారుల మ‌ధ్య విభేదాలు త‌లెత్తాయి. ఎన్నిక‌ల నియ‌మావ‌ళి ఉల్లంఘం లాంటి అంశాల‌పై జ‌రిగే స‌మావేశాల‌కు దూరంగా ఉండాల‌నుకుంటున్న‌ట్లు ల‌వాసా సీఈసీకి రాశారు. మోదీ, షాలు ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించార‌ని, కానీ వారికి క్లీన్ చిట్ ఇవ్వ‌డం ప‌ట్ల ల‌వాసా బోర్డు తీరుపై అసంతృప్తితో ఉన్నారు. మైనార్టీల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే త‌ప్ప తాను స‌మావేశాల‌కు హాజ‌రుకావ‌డంలో అర్థంలేద‌ని ల‌వాసా త‌న లేఖ‌లో రాశారు. అందుకే స‌మావేశాల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘంలో సీఈసీ సునిల్ అరోరాతో పాటు అశోక్ ల‌వాసా, సుశిల్ చంద్రాలు ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్లుగా ఉన్నారు. ల‌వాసా రాసిన లేఖ‌పై సీఈసీ సునిల్ అరోరా ఇవాళ స్పందించారు. ఎన్నిక‌ల సంఘం స‌భ్యుల్లో విబేధాలు స‌హ‌జ‌మ‌ని, అవి గ‌తంలో వ‌చ్చాయ‌ని, వ‌స్తూనే ఉంటాయ‌ని సునిల్ అరోరా త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం కావ‌డం స‌హ‌జ‌మే అని ఆయ‌న అన్నారు. కానీ ఈసీ అంత‌ర్గ‌త ప‌నితీరుపై మీడియాలో అస‌హ‌జ‌మైన క‌థ‌నం రాయ‌డం స‌రిగా లేద‌న్నారు.

1590
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles