ఆంధ్రప్రదేశ్ నిరుత్సాహ పరిచిన మోదీ..హోదా లేదు ప్యాకేజీ లేదు..

Thu,October 22, 2015 02:37 PM

disappointed pm modi no package  for ap

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం అతిర‌థ మ‌హార‌థుల మ‌ద్య జ‌రిగింది. ఈ వేడుక‌లో ప్ర‌ధాని మాట్లాడుతూ అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని కావాలని ఆశిస్తున్నా. 100 స్మార్ట్ సిటీలను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్ నివాసానికి వెళ్లి చంద్రబాబు ఆహ్వానించారని తెలిసి సంతోషించా. రాష్ట్ర విభజన సమయంలో ఆమాయకుల ప్రాణాలు పోవడం నన్ను ఎంతో కలచివేసింది. తెలంగాణ అయినా... ఆంధ్రప్రదేశ్ అయినా తెలుగువారంతా ఒక్కటే. అన్నారు.

ఈ వేడుక‌కు ప్ర‌ధాన మంత్రి మోడీ హాజ‌రుకావ‌డంతో ప్ర‌త్యేక ప్యాకేజీ విష‌యంపై ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు ఎంతో ఆత్రుత‌గా వేచిచూశారు. అయితే ఆయన తన ప్రసంగంలో ఎక్కడా ప్యాకేజీల ప్రస్తావన తేలేదు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన ఉన్నట్లు ఆయన ఎక్కడా చెప్పలేదు. తాను కొత్త రాజ‌ధానిక అమ‌రావ‌తికి సహకరిస్తామని చెప్పడమే ప్రస్తుతానికి ప్రజల్లో కలిగిన ఊరట. పార్లమెంట్ ప్రాంగణం నుంచి మట్టిని, యమునా నది నుంచి పవిత్ర నీటిని తీసుకువచ్చిన మోదీ ఎవో కానుకలు పట్టుకొస్తారనుకున్న వారికి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం నిరాశ‌ప‌రిచింది.

2006
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles