Telangana Intermediate 1st & 2nd Year Results 2019

రాహుల్‌ను ప్రధానిని చేసిన దిగ్విజయ్!

Tue,March 28, 2017 04:27 PM

Digvijaya Singh just declared Rahul Gandhi cabinet on Twitter

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి పొరపాటు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఏకంగా ప్రధానిని చేశారు దిగ్విజయ్. దివంగత కేంద్ర మంత్రి దినేష్ సింగ్ ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ కేబినెట్‌లో పని చేశారని దిగ్విజయ్ ట్వీట్ చేశారు. అయితే మాజీ కాంగ్రెస్ ఎంపీ రాజ్‌కుమారి రత్న సింగ్ చిత్రీకరించిన ఓ వీడియోను పోస్టు చేస్తూ.. రత్నసింగ్ గురించి ట్విట్టర్‌లో వివరణ ఇచ్చారు. మాజీ ఎంపీ రత్నసింగ్ మాజీ కేంద్ర మంత్రి రాజ్ దినేష్ సింగ్ కూతురని వివరించారు.


దినేష్ సింగ్ ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ కేబినెట్‌లో పని చేశారని ట్వీట్ చేశారు. కాసేపటి తర్వాత తన పొరపాటును తెలుసుకున్న దిగ్విజయ్.. రాహుల్ స్థానంలో రాజీవ్ గాంధీ అని రాసి తన తప్పును సరిదిద్దుకున్నారు. గతంలో కూడా దిగ్విజయ్ సింగ్.. ఆగస్టు, 2016లో భోపాల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పాక్ ఆక్రమిత కశ్మీర్ అనాల్సింది పోయి ఇండియా ఆక్రమిత కశ్మీర్ అని నోరు జారారు. మరోసారి ఒసామా బిన్ లాడెన్‌ను ఒసామాజీ అని గౌరవంగా వ్యాఖ్యానించి విమర్శల పాలయ్యారు. ఇప్పుడు రాహుల్‌ను ప్రధానిని చేసి నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.


2224
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles