గోవా, కర్నాటక బాధ్యతల నుంచి దిగ్విజయ్ తొలగింపు

Sat,April 29, 2017 09:15 PM

Digvijaya Singh Dropped As Congress In Charge Of Goa and Karnataka

హైదరాబాద్: గోవా, కర్నాటక రాష్ర్టాల ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌ను ఆ పార్టీ అధిష్ఠానం తొలగించింది. ఆయన స్థానంలో చెల్లా కుమార్‌ను గోవా కాంగ్రెస్ ఇన్‌ఛార్జీగా అదేవిధంగా కే.సీ. వేణుగోపాల్‌ను కర్నాటక కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించింది. ఇటీవలే జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 స్థానాలకు గాను 17 స్థానాలు గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఈ విషయంలో పారికర్ సైతం దిగ్విజయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దిగ్విజయ్ ఆలస్యం కారణంగానే తాము గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్న విషయం తెలిసిందే.

939
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles