న‌క్స‌ల్స్‌తో సంబంధాలా ? ద‌మ్ముంటే అరెస్టు చేయండి

Mon,November 19, 2018 03:59 PM

Digvijaya Singh denies Naxal links and dares to arrest him

న్యూఢిల్లీ: బీమా కోరేగావ్ కేసును విచారిస్తున్న పుణె పోలీసులు మావో లింకుల‌పై ఆరా తీస్తున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ సీఎం నెంబ‌ర్ నుంచి మావో మ‌ద్ద‌తుదారుల‌కు ఫోన్ వెళ్లిన‌ట్లు వాళ్లు తేల్చారు. ఆ ఆరోప‌ణ‌ల‌ను సీనియ‌ర్ కాంగ్రెస్ నేత, మాజీ సీఎం దిగ్విజ‌య్ సింగ్ ఖండించారు. ఏవైనా ఆధారాలు ఉంటే చూపెట్టాల‌ని, ప్ర‌ధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌, సీఎం ఫ‌డ్న‌వీస్‌ల‌కు స‌వాల్ చేస్తున్నాన‌ని, ఒక‌వేళ వాళ్లు ఏమీ నిరూపించ‌కుంటే, వాళ్ల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు దిగ్విజ‌య్‌ తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పార్టీలు త‌న‌పై అసత్య ఆరోప‌ణ‌లు చేస్తున్నాయ‌న్నారు. మావోల నుంచి సేక‌రించిన ఓ లేఖ‌లో దిగ్విజ‌య్ సింగ్ ఫోన్ నెంబ‌ర్ ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ అంశం వివాద‌మైంది.

2070
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles