చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పిన దిగ్విజయ్ సింగ్

Mon,June 11, 2018 12:35 PM

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ మరోసారి పప్పులో కాలేశాడు. ఓ మిత్రుడు తనకు పంపిన ఫోటోను ట్వీట్ చేసి.. భంగపాటుకు గురయ్యాడు దిగ్విజయ్. ఓ మీడియా సంస్థ ఆ ఫోటోపై స్పష్టత ఇవ్వడంతో దిగ్విజయ్ క్షమాపణలు చెప్పాడు. భోపాల్‌లోని సుభాష్ నగర్ రైల్వేగేట్ వద్ద నిర్మిస్తున్న రైల్వే ైఫ్లె ఓవర్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని విజ్ఞప్తి చేస్తూ దెబ్బతిన్న పిల్లర్‌ను దిగ్విజయ్ సింగ్ తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేశాడు. ఇటీవలే వారణాసిలో ైఫ్లె ఓవర్ కూలిపోవడంతో 18 మంది మృతి చెందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కావొద్దని ట్వీట్ చేశాడు దిగ్విజయ్.

దిగ్విజయ్ ట్వీట్‌పై ఓ ఇంగ్లీష్ మీడియా సంస్థ స్పందించింది. దిగ్విజయ్ ట్వీట్ చేసిన ఫోటో.. ఇక్కడిది కాదని.. అది పాకిస్థాన్ రావల్పిండిలోని మెట్రో పిల్లర్ దెబ్బతిన్న దృశ్యమని ఆ మీడియా సంస్థ స్పష్టత ఇస్తూ ఆ ఫోటోను రీట్వీట్ చేసింది. దీంతో దిగ్విజయ్ సింగ్ క్షమాపణలు చెప్పారు. ఈ ఫోటోను నా మిత్రుడు తనకు పంపడంతో పోస్టు చేశాను అని వివరణ ఇచ్చారు దిగ్విజయ్. ఆ ఫోటోను సరిచూసుకోకుండా పోస్టు చేయడం తన తప్పు అని దిగ్విజయ్ పేర్కొన్నారు.

2016లో తెలంగాణ ప్రభుత్వాన్ని తప్పుబట్టేందుకు ఇదే ఫోటోను దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లో మెట్రో పిల్లర్ల పరిస్థితి ఇదంటూ ఆయన ట్వీట్ చేయడంతో.. దానిపై మినిస్టర్ కేటీఆర్ వివరణ ఇచ్చారు. ఆగస్టు 3, 2016న కేటీఆర్ ట్వీట్ చేస్తూ.. ఆ మెట్రో పిల్లర్ హైదరాబాద్‌లో నిర్మిస్తున్నది కాదని.. పాకిస్థాన్ రావల్పిండిలోని మెట్రో పిల్లర్ అని కేటీఆర్ తెలిపారు.


2776
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles