సిగ్గు సిగ్గు.. ఎమ్మెల్యేలను షాపింగ్ చేశారు..

Sat,April 1, 2017 11:56 AM

న్యూఢిల్లీ : గోవా సీఎం మ‌నోహ‌ర్ పారిక‌ర్ ఆ రాష్ట్ర ప్ర‌జ‌లకు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కాంగ్రెస్ నేత దిగ్విజ‌య్ సింగ్ అన్నారు. థ్యాంక్ త‌న‌కు కాద‌ని, కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి థ్యాంక్స్ చెప్పాల‌న్నారు. ప్ర‌భుత్వం ఏర్పాటు కోసం ఎమ్మెల్యేల‌ను షాపింగ్ చేసిన గ‌డ్క‌రీకి పారిక‌ర్ థ్యాంక్స్ చెబితే బాగుంటుంద‌న్నారు. అధికార దాహంతో ఎమ్మెల్యేల‌ను కొన్నార‌ని, అది సిగ్గుచేటు చ‌ర్య అని, గోవా ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని, వాళ్ల‌కు క్ష‌మాప‌ణలు చెప్పాల‌ని పారిక‌ర్‌ను ఉద్దేశిస్తూ దిగ్విజ‌య్ ఇవాళ ట్వీట్స్ చేశారు.
శుక్ర‌వారం రాజ్య‌స‌భ‌కు వ‌చ్చిన పారిక‌ర్ అక్క‌డ దిగ్విజ‌య్‌పై కామెంట్స్ చేశాడు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమై, తాను సీఎం కావడానికి వీలు కల్పించిందని, అందుకు దిగ్విజయ్‌సింగ్‌కు కృతజ్ఞతలని ఆయన చెప్పారు. రాజ్యసభకు వచ్చిన పారిక‌ర్‌ చైర్మన్, డిప్యూటీ చైర్మన్, సభ్యులకు వీడ్కోలు పలికారు. తను రక్షణశాఖ మంత్రిగా ఉన్నప్పుడు సభ్యులు అందించిన మద్దతుకు కృతజ్ఞతలు చెప్పారు. వారు కోరుకున్నప్పుడల్లా గోవాకు రావచ్చని పారికర్ ఆహ్వానం పలికారు. గోవా సీఎంగా ప్రమాణం చేసే ముందు రక్షణమంత్రిగా ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పారికర్ సభలో అడుగుపెట్టగానే కాంగ్రెస్ సభ్యులు దిగ్విజయ్‌సింగ్, బీకే హరిప్రసాద్, రాజీవ్‌గౌడ, రజినీ పాటిల్ తదితరులు లేచి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గోవా గవర్నర్ మృదులా సిన్హా బీజేపీని ఆహ్వానించకుండా ఉండాల్సిందన్నారు. ఆమె ప్రవర్తనపై చర్చించడానికి సభలో ఆయన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానంపై ఇంకా చర్చించాల్సి ఉంది.

1404
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles