నీలేకని నేతృత్వంలో డిజిటల్ ప్యానెల్

Wed,January 9, 2019 07:30 AM

Digital panel headed by Nilekani

న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ బలోపేతానికి నందన్ నీలేకని నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీని మంగళవారం ఆర్బీఐ నియమించింది. దేశంలో మరింత భద్రమైన, రక్షణతో కూడిన డిజిటల్ చెల్లింపులకు తగిన సూచనలు, సలహాలను ఈ కమిటీ ఇవ్వనున్నది. ఐదుగురు సభ్యులుగల ఈ కమిటీ.. డిజిటల్ లావాదేవీల పెంపునకు దోహదపడే నిర్ణయాలు, ప్రోత్సాహకాలను ప్రకటించనుందని ఓ ప్రకటనలో ఆర్బీఐ తెలిపింది. తొలిసారి సమావేశమైన దగ్గర్నుంచి 90 రోజుల్లోగా కమిటీ నివేదికను సమర్పించనుందని కూడా చెప్పింది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ వ్యవస్థాపక చైర్మన్‌గా ఉన్న నీలేకని.. ఆధార్ రూపకర్త కూడా అన్న విషయం తెలిసిందే. ఈ కమిటీలో ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ హెచ్‌ఆర్ ఖాన్, విజయా బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ కిశోర్ సన్సీ, ఐటీ, ఉక్కు మంత్రిత్వ శాఖల మాజీ కార్యదర్శి అరుణా శర్మ, ఐఐఎం అహ్మదాబాద్ సీఐఐఈ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ సంజయ్ జైన్ సభ్యులుగా ఉన్నారు.

410
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles