విబేధాలు వివాదాలు కావొద్దు..

Mon,August 12, 2019 05:41 PM

Differences should not become disputes, India Tells China

హైద‌రాబాద్‌: క‌శ్మీర్ అంశంపై చైనాకు ఇండియా క్లారిటీ ఇచ్చింది. క‌శ్మీర్ అంశం అంత‌ర్గ‌తమ‌ని, దానికి త‌గిన‌ట్లుగానే మార్పులు చేశామ‌ని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంక‌ర్ తెలిపారు. చైనా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న ఇవాళ బీజింగ్‌లో ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యితో స‌మావేశం అయ్యారు. ఒక‌వేళ రెండు దేశాల మ‌ధ్య ఎటువంటి విబేధాలు ఉన్నా.. అవి వివాదాలుగా మార‌కుండ చూసుకోవాల‌ని జైశంక‌ర్ తెలిపారు. క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేయ‌డాన్ని చైనా వ్య‌తిరేకించింది. అయితే దీన్ని భార‌త్ కొట్టిపారేసింది. చైనా, భార‌త్ బంధం.. ప్ర‌పంచ రాజ‌కీయాల్లో ఓ విభిన్న‌మైన‌ద‌ని జైశంక‌ర్ అన్నారు. ఇండియా, చైనా దేశాలు సంయుక్తంగా ఓ వంద కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌నున్న‌ట్లు జైశంక‌ర్ చెప్పారు. ఫిల్మ్ వీక్‌ను ప్రారంభించ‌నున్నాయి. చైనా మంత్రి వాంగ్ యి కూడా స్పందించారు. వాణిజ్య సంబంధాల‌పై భార‌త చూపిస్తున్న ఆస‌క్తిని చైనా ఆహ్వానిస్తున్న‌ట్లు మంత్రి చెప్పారు. ఇండియా ఉత్ప‌త్తుల‌కు అన్ని అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌న్నారు. పెట్టుబ‌డులు, పారిశ్రామిక ఉత్ప‌త్తి, టూరిజం లాంటి అంశాల‌పై రెండు దేశాలు మ‌రింత లోతుగా ప‌నిచేయాల‌న్నారు.

2763
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles