ఆర్బీఐని 3.6 లక్షల కోట్లు అడగలేదు!

Fri,November 9, 2018 03:13 PM

Did not seek money from RBI reserve says Government

న్యూఢిల్లీ: ఆర్బీఐ రిజర్వ్ నుంచి రూ.3.6 లక్షల కోట్లు అడిగినట్లు వస్తున్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ఈ పుకార్లపై ట్విటర్‌లో స్పందించారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉన్నదని, ఆర్బీఐని రూ.3.6 లక్షల కోట్లు లేదా లక్ష కోట్లు అడిగినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు అని గార్గ్ ట్విటర్‌లో స్పష్టం చేశారు. నిజానికి 2013-14లో ద్రవ్యలోటు 5.1 శాతంగా ఉండేది. అయితే 2014-15 నుంచి దానిని గణనీయంగా తగ్గించగలిగాం. 2018-19 ఆర్థిక సంవత్సరాన్ని కేవలం 3.3 శాతం ద్రవ్యలోటుతో ముగిస్తాం. అంతేకాదు మార్కెట్ నుంచి తీసుకోవాల్సిన రూ.70 వేల కోట్ల అప్పును కూడా ప్రభుత్వం వదులుకుంది అని గార్గ్ తెలిపారు. ఆర్బీఐ, ప్రభుత్వం మధ్య వివాదానికి అసలు కారణం.. ఆర్బీఐ మిగులు నిల్వల నుంచి రూ.3.6 లక్షల కోట్లను ప్రభుత్వం అడగడం వల్లే అని మీడియాలో వార్తలు వచ్చాయి. అటు కాంగ్రెస్ కూడా ఇవే ఆరోపణలు చేసింది.

1713
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles