వ‌య‌నాడ్‌లో భార‌త్ ఓడిపోయిందా ?

Wed,June 26, 2019 02:39 PM

Did India lose in Wayanad, asks PM Modi in Rajya Sabha

హైద‌రాబాద్‌: వ‌య‌నాడ్‌లో భార‌త్ ఓడిపోయిందా ? లేక రాయ్‌బ‌రేలీ ఓడిందా ? తిరువ‌నంత‌పురంలో ఓట‌మిపాలైందా ? మ‌రి అమేథీలో ఏం జ‌రిగింది ? ఇవేం వాద‌న‌లు ? కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే.. ఇక దేశ‌మే ఓడిన‌ట్టా ! ఆవేశానికి కూడా హ‌ద్దులు ఉంటాయి. 17 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెల‌వ‌లేద‌ని ప్ర‌ధాని మోదీ ఆ పార్టీపై ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయ‌న రాజ్య‌స‌భ‌లో మాట్లాడారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానం సంద‌ర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ, దాని మిత్ర‌ప‌క్షాలు ఎన్నిక‌ల్లో గెలిచాయి, కానీ దేశం ఓడిపోయింద‌ని, ప్ర‌జాస్వామ్యం ఓట‌మిపాలైంద‌ని కొంద‌రు అన‌డం బాధ‌కు గురిచేస్తోంద‌న్నారు. అలాంటి ప్ర‌క‌ట‌న‌లు నిజంగా దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. ఓట‌ర్ల నిర్ణ‌యాన్ని ఎందుకు ప్ర‌శ్నిస్తున్నార‌ని మోదీ అన్నారు. స‌మ్మాన్ నిధి స్కీమ్ కోసం రైతులు అమ్ముడుపోయారంటున్నారు. ఇది నిజంగా షాక్‌కు గుర‌య్యే అంశ‌మే, ఇందులో మీడియాను కూడా త‌ప్పుప‌డుతున్నారు, మీడియా వ‌ల్లే బీజేపీ ఎన్నిక‌లు నెగ్గిందంటున్నారు, అంటే మీడియా అమ్మ‌కానికి ఉందా, ఇదే లాజిక్ త‌మిళ‌నాడు, కేర‌ళ‌కు వ‌ర్తిస్తుందా అని మోదీ ప్ర‌శ్నించారు.

1569
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles