భక్తి ఎక్కువై..కొరడాతో కొట్టుకొని..వీడియో

Wed,December 13, 2017 04:45 PM

Devotees whip themselves with ropes as a part of ritual in tamilanadu


తమిళనాడు: దేవుడిపై భక్తి ఉండాలి. కానీ అతిభక్తి ఉండకూడదు. తమిళనాడులో కొంతమంది భక్తులకు దేవుడిపై భక్తి మరీ ఎక్కువైపోయింది. ఎంతలా అంటే తమని తాము మరిచిపోయి..అసలేం ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేనంతగా. తమిళనాడులోని పూసరిపాలయం అడైకాలమ్మన్ ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భక్తులు కొరడాలతో కొట్టుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు. అయితే వీరిలో ఓ భక్తుడు మాత్రం పూనకంతో ఊగిపోతూ తనను తాను ఎడాపెడా కొరడాతో కొట్టేసుకుని..గిర్రున తిరిగి కిందపడిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు వచ్చి ఆ వ్యక్తిని అక్కడినుంచి తీసుకెళ్లారు. ఆ వీడియోను మీరూ చూడండి.2773
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS