ఆ వివాదాస్పద ఎమ్మెల్యేకు బీజేపీ టికెట్ ఇవ్వలేదు..

Mon,November 19, 2018 12:15 PM

Denied Ticket Rajasthan BJP Man Quits Will Contest As An Independent

జైపూర్ : రాజస్థాన్ సిట్టింగ్ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహుజాకు భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ లభించలేదు. దీంతో ఆయన బీజేపీకి రాజీనామా చేసి.. సంగానీర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా అహుజా మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నుంచి తనకెందుకు టికెట్ ఇవ్వలేదో కారణం చెప్పలేదు. పార్టీ పెద్దలు కనీసం తనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. తన మద్దతుదారులు, కుటుంబ సభ్యుల కోరిక మేరకు బీజేపీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా సంగానీర్ నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. గో సంరక్షణ, అయోధ్యలో రామమందిరం నిర్మించాలన్న నినాదంతో తన ప్రచారం సాగుతుందని అహుజా చెప్పారు.

అయితే 2016, ఫిబ్రవరిలో జ్ఞాన్ దేవ్ అహుజా సంచలన వ్యాఖ్యలు చేసి వివాదస్పదమయ్యారు. అఫ్జల్ గురు ఉరిశిక్ష అమలు చేసిన దినం(ఫిబ్రవరి 9) సందర్భంగా.. దానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జేఎన్ యూ విద్యార్థులు ఆందోళన చేయడంతో వారిని దేశ వ్యతిరేకులుగా అభివర్ణించారు. అంతేకాకుండా ఆ యూనివర్సిటీలో ప్రతి రోజు 3 వేల బీర్ బాటిల్స్, 2 వేల స్వదేశీ మద్యం బాటిల్స్, పదివేల సిగరెట్లు, నాలుగు వేల బీడీలు, 3 వేల కండోమ్స్, 500 అబార్షన్ ఇంజెక్షన్స్ లభిస్తున్నాయని అహుజా చెప్పారు. దీంతో ఆయనపై పార్టీ అధిష్టానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

1412
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles