విమానంలో మద్యం కావాలని మ‌హిళ రౌడీయిజం: వీడియో

Wed,November 14, 2018 03:40 PM

Denied booze, drunk Irish woman abuses and spits at Air India crew

లండన్: తప్పతాగిన ఐరిష్ మహిళ ఎయిర్‌ఇండియా ఇంటర్నేషనల్ విమానంలో రచ్చరచ్చ చేసింది. విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో తనకు మరింత వైన్ కావాలని వాగ్వాదానికి దిగింది. అసభ్య పదజాలంతో విమాన సిబ్బందిని దూషిస్తూ.. వారిపైకి దూసుకెళ్తూ గొడవ చేసింది. చెప్పడానికి వీల్లేని పదాలతో సంభోదించింది. మహిళా ప్రయాణికురాలు రౌడీలా వ్యవహరిస్తుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గమ్యస్థానం లండన్‌లో విమానం లాండ్ అయిన తర్వాత ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

గొడవకు కారణమేంటంటే.. ఐరిష్ మహిళ ఇప్పటికే పరిమితికి మించి మద్యం సేవించి ఉన్నారని క్యాబిన్ క్రూ.. కమాండర్‌కు ఫిర్యాదు చేశాడు. ఆమెకు మద్యం ఇవ్వొద్దని కమాండర్ సూచించడంతో బిజినెస్ క్లాస్‌లో ఉన్న ఆమె తీవ్ర కోపంతో రగిలిపోయింది. అప్పటి నుంచి వారిని బూతులు తిట్టడంతో పాటు అసభ్యకరంగా వ్యవహరించడం ప్రారంభించింది. పైలట్ వద్దకు వచ్చిన మహిళా అతని వైపు ఉమ్మేసింది. ఆమె రెచ్చిపోయి రౌడీయిజం చేసినప్పటికీ క్రూతో పాటు పైలట్ ప్రశాంతంగా నిలబడి ఉన్నారు.4207
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles