జైట్లీకి అంత సీన్ లేదు.. నోట్ల రద్దు ఐడియా ఆరెస్సెస్‌దే!

Tue,February 13, 2018 04:58 PM

Demonetisation is the Idea of RSS says Rahul Gandhi

న్యూఢిల్లీః బీజేపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. దేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలను బీజేపీ తమ చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నదని ఆరోపించారు. అందుకే ఆరెస్సెస్ ప్రతి సంస్థలో తమ మనిషిని ఉంచిందని విమర్శించారు. అసలు నోట్ల రద్దు ఆలోచన ఆర్బీఐదో లేక అరుణ్ జైట్లీదో కాదని.. ఆరెస్సెస్ సూచన మేరకే రద్దు చేశారని రాహుల్ చెప్పారు. ఆర్థికశాఖలోని ఓ అధికారిదే ఈ నోట్ల రద్దు ఆలోచన. ఆయన ఎవరో కాదు.. ఆరెస్సెస్ వ్యక్తే. తన ఆలోచనను ప్రధాని మెదడులోకి ఎక్కించారు. ఆయన రద్దు చేసేశారు అని రాహుల్ ఆరోపించారు. ఆర్మీ వాళ్లు ఆరు నుంచి ఏడు నెలల పాటు మిలిటరీకి ఇచ్చే శిక్షణను సంఘ్ పరివార్ కేవలం మూడు రోజుల్లో పూర్తి చేస్తుందన్న ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కామెంట్స్‌పై రాహుల్ సీరియస్ అయ్యారు. ఇది ఆర్మీని అవమానించడమే అవుతుందని, భగవత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ ప్రస్తుతం కర్ణాటకలో పర్యటిస్తున్నారు.

2016
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS