దిల్లీకీ జామా మ‌స్జిద్‌ తోడో..

Sat,November 24, 2018 09:42 AM

ఉన్నావ్: బీజేపీ ఎంపీ సాక్షీ మ‌హారాజ్ మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో ఉన్న జామా మ‌సీదును ధ్వంసం చేయాల‌న్నారు. ఆ మ‌సీదు వ‌ద్ద ఉన్న మెట్ల‌ను తొల‌గిస్తే, వాటి కింద హిందూ దేవ‌తామూర్తుల విగ్ర‌హాలు ఉంటాయ‌న్నారు. ఒక‌వేళ దేవ‌తామూర్తులు లేకుంటే త‌న‌ను ఉరి తీయాల‌న్నారు. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని ఉన్నావ్‌లో జ‌రిగిన ఓ స‌భ‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. తాను గ‌తంలోనే ఇలాంటి ప్ర‌క‌ట‌న చేశార‌న‌న్నారు. అయోధ్య మ‌థుర‌, కాశీ కో చోడో.. దిల్లీ కీ జామా మ‌స్జిద్ తోడో, అగ‌ర్ సీడియో మే మూర్తియా నా నిక‌లే తో ముజే ఫాంసీ పె ల‌ట్కా దేనా అని డైలాగ్‌లు విసిరారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన మొద‌ట్లోనే ఈ ప్ర‌క‌ట‌న చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. అయోధ్య‌, మ‌థుర‌, కాశీ గురించి ఆలోచించ‌కండి అని, ఢిల్లీలోని జామా మ‌సీదులో ఉన్న మెట్ల‌ను ధ్వంసం చేస్తే హిందూ దేవ‌త‌ల విగ్ర‌హాలు బ‌య‌ట‌ప‌డుతాయ‌ని ఎంపీ సాక్షీ మ‌హారాజ్ అన్నారు. త‌న మాట‌కు ఇప్ప‌టికీ క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇటీవ‌ల పురావాస్తు శాఖ కూడా ఇదే విష‌యాన్ని వెల్ల‌డించింది. మొఘ‌ల్ పాల‌కులు హిందువుల మ‌నోభావాల‌తో ఆడుకున్నార‌ని, సుమారు మూడు వేల ఆల‌యాల‌ను ధ్వంసం చేసి వాటి స్థానంలో మ‌సీదులు క‌ట్టార‌ని ఆయ‌న తెలిపారు.1458
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles