ఢిల్లీ ఉరి.. ఆ ఫ్యామిలీని చివరిసారి చూసింది ఇతనే..

Tue,July 3, 2018 03:03 PM

delivery boy Rishi was last person to see 11 member family found dead in Delhi

న్యూఢిల్లీ: దేశరాజధానిలో ఆదివారం ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫ్యామిలీని చివరిసారిగా చూసింది వాళ్లకు ఫుడ్ డెలివరీ చేసిన రిషీ అనే డెలివరీ బాయ్. ఉరివేసుకున్న భాటియా ఫ్యామిలీ ఆ రోజు రాత్రి 10.30 నిమిషాలకు 20 రోటీలు కావాలంటూ ఆర్డర్ చేశారని, ఆ రోటీలను డెలివరీ చేసేందుకు 10.45కు వాళ్ల ఇంటికి వెళ్లినట్లు డెలివరీ బాయ్ రిషీ తెలిపాడు. భాటియా కుమార్తె రోటీలను పికప్ చేసుకుందని, తండ్రిని బిల్లును కట్టుమంటూ ఆమె సూచించిందని డెలివరీ బాయ్ చెప్పాడు. జూలై ఒకటవ తేదీన జరిగిన సంచలన సామూహిక ఆత్మహత్య కేసులో ఆ ఇంటి వ్యక్తులను చివరిసారిగా చూసింది ఈ కుర్రాడే.

బురారీ ప్రాంతంలో ఉన్న భాటియా ఇంటికి ఇవాళ ఉద‌యం క్రైం బ్రాంచ్ పోలీసులు వెళ్లారు. అక్క‌డ ఉన్న క్లూస్‌ను వాళ్లు సేక‌రించారు. మ‌రో వైపు పోలీసుల వాద‌న‌ను కుటుంబ‌స‌భ్యులు కొట్టిపారేస్తున్నారు. భాటియా కుటుంబం మ‌త‌విశ్వాసాల‌కు క‌ట్టుబ‌డి ఉంటుంద‌ని, కానీ మీడియాలో వ‌స్తున్న‌ట్లు తాంత్రిక పూజ‌లు నిర్వ‌హించ‌లేద‌ని బంధువు సుజాతా తెలిపారు. 11 మంది మ‌ర‌ణం వెనుక కుట్ర ఉంద‌ని, భాటియా ఇంట్లో ఉన్న పైపులు సోలార్ ప్రాజెక్టు కోసం తెచ్చార‌ని ఆమె తెలిపారు.

3247
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles