హస్తినలో ఓటేసిన 111ఏండ్ల వృద్ధుడు

Sun,May 12, 2019 07:38 PM

Delhis oldest voter, 111-year old Bachan Singh gets finger inked

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరో విడుత ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఏడు రాష్ర్టాల్లోని 59 స్థానాలకు పోలింగ్‌ నిర్వహించగా ఆయా నియోజకవర్గాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. శతాధిక వృద్ధులు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఢిల్లీకి చెందిన బచన్‌ సింగ్‌ 111ఏండ్ల వయసులోనూ ఓటేసి అదర్శంగా నిలిచారు. వయసు అనేది సంఖ్య మాత్రమేనని బచన్‌ కుటుంబసభ్యులు అంటున్నారు. ఢిల్లీలోని తిలక్‌ విహర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1951 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ బచన్‌ సింగ్‌ ఓటు వేశారని ఆయన కుమారుడు జస్బీర్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఇన్నేండ్లలో ఒక్కసారి కూడా ఓటుకు దూరంగా ఉన్న దాఖలాలు లేవన్నారు. పోలింగ్‌ అధికారులతో కలిసి కేంద్రానికి కారులో వచ్చిన ఆయన వీల్‌ ఛైర్‌ సాయంతో పోలింగ్‌ బూత్‌ లోపలికి వెళ్లి ఓటేశారు.

1453
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles