ఢిల్లీ ఉరి.. స్టూళ్లు, వైర్లు వాళ్లే తెచ్చుకున్నారు..

Thu,July 5, 2018 10:05 AM

Delhi mass suicide : family members brought stools and wires

న్యూఢిల్లీ: దేశరాజధానిలో సంచలనం రేపిన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్ప‌ద‌ ఆత్మహత్య కేసులో ఢిల్లీ పోలీసులు తాజాగా కొంత సమాచారాన్ని సేకరించారు. నగరంలోని బురారీ ప్రాంతంలో భాటియా ఫ్యామిలీ ఇంటి ముందున్న సీసీటీవీ ఫూటేజ్‌ను పరిశీలించారు. జూన్ 30వ తేదీన రికార్డు అయిన సుమారు రెండున్నర గంటల ఫూటేజ్‌ను వాళ్లు క్షుణ్ణంగా పరిశీలించారు. భాటియా ఫ్యామిలీ ఎదురింట్లో ఉన్న సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా పోలీసులు ఒక విశ్లేషణకు వచ్చారు. కుటుంబంలోని 11 మందిలో 10 మంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఉరి వేసుకునేందుకు కావాల్సిన స్టూళ్లు, వైర్లను ఆ కుటుంబసభ్యులే తీసుకువచ్చినట్లు సీసీటీవీ ఫూటేజ్ ద్వారా తెలిసింది.

ఆ రోజు రాత్రి 10 గంటల సమయంలో సవితతో పాటు ఆమె కూతురు నీతూ కొన్ని స్టూళ్లతో ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్లు వీడియోలో స్పష్టమైంది. ఒకదానిపై ఒకటి అమర్చిన స్టూళ్లను చేతుల్లో పట్టుకుని వాళ్లు ఇంట్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత 10.15 నిమిషాలకు ఓ మైనర్ అబ్బాయి నల్లటి ఎలక్ట్రిక్ వైర్లను ఇంట్లోకి తీసుకువెళ్లాడు. ైప్లెవుడ్ షాపు నుంచి అతను ఆ వైర్లను తీసుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత మరో 24 నిమిషాలకు డెలివరీ బాయ్.. ఫుడ్ డెలివరీ చేశాడు. మళ్లీ 10.57 నిమిషాలకు భవ్‌నేశ్ కుక్కపిల్లను వాకింగ్ కోసం బయటకు తీసుకెళ్లాడు. అతను మరో ఏడు నిమిషాల తర్వాత ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. పక్కనే ఉన్న ైప్లెవుడ్ షాపు తాళాలను చెక్ చేసి ఆ తర్వాత అతను ఇంట్లోకి వెళ్లాడు.

ఇక ఆ తర్వాత కొన్ని గంటల పాటు భాటియా ఫ్యామిలీ కదలికలు ఏమీ కనబడలేదు. జూలై 1వ తేదీన ఉదయం 5.56 నిమిషాలకు భాటియా ఇంట్లో ఉన్న గ్రాసరీ దుకాణం ముందు పాల ప్యాకెట్లను వదిలివెళ్తారు. కానీ ఆ ప్యాకెట్లను తీసుకురావడానికి ఎవరూ రారు. అయితే ఉదయం 7.14 నిమిషాలకు ఓ వ్యక్తి పాల ప్యాకెట్ల కోసం భాటియా షాపుకు వచ్చాడు. ప్యాకెట్లు బయటే ఉండడం చూసి అతను ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో వేలాడుతున్న శరీరాలను చూసి అతను షాక్ అయ్యాడు. ఆ ఇంటి నుంచి పోలీసులు సుమారు 10 పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రిజిస్టర్‌లు, నోట్‌బుక్‌లను కూడా సీజ్ చేశారు. భాటియా ఫ్యామిలీని ఉరివేసుకునేలా ప్రేరేపించిన అంశాలు ఆ లేఖల్లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

2007, జూలై 8న మొదటి సారి తాంత్రిక పూజ గురించి లేఖలో రాసినట్లు తెలుస్తోంది. దేవీ భర్త భూపాల్ సింగ్ 2007లోనే మరణించాడు. చనిపోయిన తన తండ్రి ఇస్తున్న ఆదేశాల ప్రకారం అన్నీ చేస్తున్నట్లు 45 ఏళ్ల లలిత్ తాను రాసుకున్న లేఖల్లో ప్రస్తావించాడు. జూన్‌లో చివరిసారి తన డైరీలో ఉరి గురించి పేర్కొన్నాడు. తాము చేసుకోబోయే ప్రక్రియను బోద్ తపస్యగా పేర్కొన్నాడు. దశలవారీగా ఎలా ఉరి వేసుకోవాలన్న అంశాలను అందులో రాశాడు. స్టూళ్లు, బట్టలు, డాక్టర్ టేపు, వైర్లు, చీరలు ఎలా వాడాలో అందులో రాసుకున్నాడు. భాటియా బంధుమిత్రుల ఫోన్ కాల్స్‌ను పోలీసులు స్టడీ చేస్తున్నారు. వారి నుంచి అనుమానాస్పద ఆత్మహత్యలకు సంబంధించిన ఆధారాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.

1881
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles