నా భూమిని శ్మశాన వాటికగా వాడుకోండి..

Mon,August 20, 2018 03:54 PM

Delhi man donates land in Kerala to cremate flood victims

న్యూఢిల్లీ : నా భూమిని శ్మశాన వాటికగా వాడుకోండి అని ఓ మానవతా వాది ముందుకొచ్చాడు. తన జన్మభూమిలో వరద బీభత్సానికి మృతి చెందిన వారిని తన భూమిలో ఖననం చేయండని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు.

కేరళ రాష్ట్రంలోని ఆడూర్ మున్సిపాలిటీలోని ఆనంద్‌పల్లి గ్రామానికి చెందిన కురువిల్ల కే. శామ్యూల్(49) తన చిన్న వయసులోనే ఢిల్లీకి వెళ్లి స్థిరపడ్డాడు. అయితే శామ్యూల్ కు ఆనందపల్లిలో ఒక ఇల్లు, 25 సెంట్ల భూమి ఉంది. ప్రస్తుతం ఈ ఇంట్లో ఎవరూ ఉండటం లేదు. కేరళలో వర్షాలు, వరద బీభత్సానికి 350 మందికి పైగా మృతి చెందిన విషయం విదితమే. వీరందరిని తన భూమిలో ఖననం చేయండని శామ్యూల్ ట్వీట్ చేశారు. మృతుల బంధువులకు భరోసా ఇచ్చి.. వారికి కాస్త ఉపశమనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు శామ్యూల్ తెలిపాడు. దీంతో శామ్యూల్ కు ఇప్పటికే అనేక ఫోన్‌కాల్స్ వచ్చాయి. శామ్యూల్ ను కాంటాక్ట్ కావాలంటే 9871358055 నెంబర్‌కు ఫోన్ చేయొచ్చు.

3916
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles