ఐఎస్‌ఐకు స్పైగా చేస్తున్న ఢిల్లీ వ్యక్తి అరెస్ట్‌

Tue,March 26, 2019 09:49 AM

Delhi Man Admits To Spying For ISI

జైపూర్‌: పాకిస్థాన్‌ స్పై ఏజెన్సీ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటలిజెన్స్‌, ఐఎస్‌ఐకు స్పైగా వ్యవహరిస్తున్న ఢిల్లీకి చెందిన మొహ్మద్‌ పర్వేజ్‌(42) అనే వ్యక్తిని సోమవారం నాడు రాజస్థాన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు మొహ్మద్‌ పర్వేజ్‌ను ఎన్‌ఐఏ ఇప్పటికే అరెస్ట్‌ చేసింది. 2017 నుంచి ఇతడు జ్యూడిషియల్‌ కస్టడీలో ఉంటున్నాడు. తాజాగా పర్వేజ్‌ను విచారణ నిమిత్తం సోమవారం నాడు పోలీసులు జైపూర్‌ తీసుకువచ్చారు. నకిలీ ఐడీతో హానీ ట్రాప్‌కు పాల్పడుతూ భారత సైనికుల వద్ద నుంచి భద్రతా సంబంధ వ్యవహారాలను తెలుసుకుని ఐఎస్‌ఐకు అందజేస్తున్నాడు. పర్వేజ్‌ విచారణలో ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నట్లుగా తెలిపాడు. గడిచిన 18 ఏళ్లలో పాకిస్తాన్‌కు 17 సార్లు వెళ్లివచ్చినట్లుగా వెల్లడించాడు.

1207
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles