ఏటీఎం చార్జీల ఎత్తివేతకు ఢిల్లీ హైకోర్టు నో

Fri,August 17, 2018 05:21 PM

Delhi HC refuses to remove limit on atm transactions

ఒక పరిమితి దాటిన తర్వాత ఏటీఎం నుంచి డబ్బు తీసుకుంటే చార్జీ పడుతుందని అందరికీ తెలుసు. అయితే అలా చార్జీ వసూలు చేయరాదని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఏటీఎంల నిర్వహణకు గార్డుల జీతాలు, విద్యుత్ ఖర్చుల వంటివి ఉంటాయని, పైగా ఇది బ్యాంకుల విధాన నిర్ణయం కిందకు వస్తుందని తెలిపింది. రిజర్వ్‌బ్యాంక్ నిబంధనల మేరకు హైదరాబాద్‌తో ఆరు మెట్రోల్లో ఖాతాదారులు తమ సొంత బ్యాంకు ఏటీఎంల నుంచి ఐదుసార్లు డబ్బు తీసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతిసారీ రు.20 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి చార్జీలు తీసేయాలన్న పిటిషనర్ కోరికను కోర్టు తిరస్కరించింది. తమ జోక్యం వల్ల బ్యాంకులు ఏటీఎంలు మూసేస్తే సంక్షోభం తలెత్తుతుందని పేర్కొన్నది.

1934
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS