కమల్ హాసన్ పై పిటిషన్‌..తిరస్కరించిన ఢిల్లీ కోర్టు

Wed,May 15, 2019 03:04 PM

Delhi HC dismisses petition against kamalhasan


ఢిల్లీ: మక్కల్ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్‌కు వ్యతిరేకంగా దాఖలైన క్రిమినల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టిపారేసింది. కమల్‌హాసన్ తమిళనాడులో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో..ఆ ప్రాంతానికి సంబంధించిన ఫోరమ్ లోనే దీనిపై సంప్రదించవచ్చునని పిటిషనర్ బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయకు సూచించింది. అదే విధంగా పిటిషనర్ అశ్విని ఉపాధ్యాయ వేసిన పిటిషన్‌ను పరిగణలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు సూచనలు చేసింది.

హిందూమతాన్ని ఉగ్రవాదంతో ముడిపెడుతూ కమల్‌హాసన్‌ చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని అశ్విని ఉపాధ్యాయ ఆరోపించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని..అశ్విని ఉపాధ్యాయ మంగళవారం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

1007
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles