ఢిల్లీలో గ్యాంగ్‌ వార్‌..అందరూ చూస్తుండగానే 15 రౌండ్ల కాల్పులు

Mon,May 20, 2019 01:17 PM

Delhi Gangsters Halt Traffic, Shoot Rival Dead in Wasseypur-style Gang War

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో పట్టపగలే రెండు గ్రూపులు కాల్పులకు పాల్పడ్డాయి. ద్వారకా మోర్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలో అందరూ చూస్తుండగానే దుండగులు 15 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పాత నేరస్తులు ప్రవీణ్‌ గెహ్లోత్‌, వికాల్‌ దలాల్‌ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరిపై ఢిల్లీ, హరియాణాల్లో హత్య, దోపిడీ కేసులు నమోదైనట్లు చెప్పారు. రెండు గ్రూపుల మధ్య సెటిల్‌మెంట్లు, భూవివాదం విషయంలో నెలకొన్న గొడవలు కాల్పులకు దారితీసినట్లు పోలీసులు వివరించారు. కారును అడ్డగించిన ముగ్గురు వ్యక్తులు కాల్పులు చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. తాజాగా ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.1666
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles