ఢిల్లీలో యువతిని చితకబాదిన యువకుడు

Fri,September 14, 2018 04:44 PM

Delhi Cop Son Thrashes Woman and Friend Films after Rajnath Singh Orders Action

న్యూఢిల్లీ : అత్యాచారం చేసేందుకు యత్నించగా యువతి తిరస్కరించింది.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో ఆమెను ఓ యువకుడు దారుణంగా కొట్టాడు. ఈ ఘటన సెప్టెంబర్ 2న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. యువతిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ స్పందించారు. ఈ ఘటనకు పాల్పడిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను ఆదేశించారు రాజ్‌నాథ్.
సెప్టెంబర్ 2వ తేదీన రోహిత్ సింగ్ తోమర్ అనే యువకుడు ఓ అమ్మాయిని తన స్నేహితుడి ఆఫీస్‌కు రావాలని చెప్పాడు. దీంతో ఆ యువతి తోమర్ స్నేహితుడి ఆఫీస్‌కు వెళ్లింది. అక్కడ ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. యువతి ప్రతిఘటించి.. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది. దీంతో కోపం తెచ్చుకున్న యువకుడు ఆమెను దారుణంగా చితకబాదాడు. కాళ్లతో తన్నాడు. మోకాలితో ముఖంపై కొట్టాడు.

ఈ తతంగాన్ని అంతా తోమర్ స్నేహితుడు వీడియో తీశాడు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ తోమర్‌ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి.. ఈ వీడియోను చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తోమర్‌తో తన వివాహాన్ని రద్దు చేసుకుంది. ఈ ఘటనపై రాజ్‌నాథ్ సింగ్ కూడా స్పందించి.. తోమర్‌పై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి తోమర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ విధించారు. రోహిత్ సింగ్ తోమర్ ఢిల్లీ పోలీసు అధికారి కుమారుడు.

4540
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS