కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి షీలా దీక్షిత్‌ పార్థీవదేహం

Sun,July 21, 2019 12:23 PM

Delhi CM Arvind Kejriwal will be present at Nigambodh Ghat during Sheila Dikshit's last rites

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నాయకురాలు, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ పార్థీవ దేహాన్ని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల సందర్శనార్థం కార్యాలయంలో పార్థీవదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నిగమ్‌ బోధ్‌ ఘాట్‌లో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఘాట్‌లో జరిగే అంత్యక్రియలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హాజరుకానున్నారు. ఢిల్లీ ప్రభుత్వం రెండు రోజులు సంతాపదినాలుగా ప్ర‌క‌టించింది.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షీలా దీక్షిత్ శనివారం ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్ దవాఖానకు తరలించారు. వైద్యుల బృందం చికిత్స అందిస్తున్న సమయంలో మరోసారి గుండెపోటు రావడంతో నిన్న‌ మధ్యాహ్నం 3:55 గంటలకు తుదిశ్వాస విడిచారు.


538
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles