అరచేయి మీద సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది

Thu,December 6, 2018 05:18 PM

Delhi Class 7 Student Kills Herself and Writes Suicide Note On Palm

అది ఢిల్లీలోని ఇందెర్‌పూరి ప్రాంతం. 7 వ తరగతి చదువుతున్న విద్యార్థిని తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్‌ను తన అర చేయి మీద రాసింది. తన అర చేయి మీద ఏం రాసిందో తెలియనప్పటికీ.. తన కూతురును స్కూల్‌లో టీచర్ తిట్టడం ద్వారానే ఆత్మహత్య చేసుకున్నదని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల సరైన కారణాన్ని తెలుసుకోవడం కోసం దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు. తన తల్లిదండ్రులు ఆఫీసుకు వెళ్లిన సమయంలో.. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

3867
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles