పోలీస్ కస్టడికి ఛత్తీస్‌గఢ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి

Tue,February 21, 2017 07:21 PM

Delhi CBI court sent Principal Secy to police custody

ఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ బీఎల్ అగర్వాల్‌కు ఢిల్లీ సీబీఐ కోర్టు ఐదు రోజుల పోలీసు కస్టడీని విధించింది. లంచం ముట్టజెప్పారనే కేసులో అగర్వాల్‌తో పాటు మరో ఇద్దరిని సీబీఐ కోర్టు పోలీసుల విజ్ఞప్తి మేరకు విచారణ నిమిత్తం ఐదు రోజుల కస్టడీకి అప్పగించింది.

కేసు వివరాలు..
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీపై సీబీఐ కేసు నమోదు చేసింది. ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు యూపీ పరిధిలోని గ్రేటర్ నోయిడాకు చెందిన ఒకరిపై అదేవిధంగా తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన మరొకరిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. తనపై సీబీఐలోనే నడుస్తున్న కేసు విషయంలో లబ్ది చేకూర్చినందుకు గాను ప్రతిఫలంగా రూ. 1.5 కోట్లను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీపై ఆరోపణ. రాయ్‌పూర్‌లోని హవాలా డీలర్‌తో రూ. 45 లక్షలు, రూ. 20 లక్షలు, మిగతా మొత్తం 2 కేజీల బంగారం రూపంలో సంబంధిత వ్యక్తులకు చేరవేశారు. విచారణలో భాగంగా సోదాలు నిర్వహించిన అధికారులు బంగారంను, రూ. 20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతుంది.

876
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles