ఆర్మీకి 10 ల‌క్ష‌ల హ్యాండ్ గ్రేనేడ్లు !

Fri,March 15, 2019 06:04 PM

Defence Ministry plans to buy 10 lakh hand grenades for combat troops

హైద‌రాబాద్: భార‌త ఆర్మీ కోసం ర‌క్ష‌ణ శాఖ సుమారు 10 ల‌క్ష‌ల హ్యాండ్ గ్రేనేడ్ల‌ను కొనుగోలు చేయ‌నున్న‌ది. మేక్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఈ గ్రేనేడ్ల డీల్ కుదర‌నున్న‌ది. ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి నిర్మలా సీతారామ‌న్ త్వ‌ర‌లో జ‌రిగే ఓ స‌మావేశంలో దీనిపై నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఇటీవ‌ల సిగ్ సార్ అజాల్ట్ రైఫిళ్ల‌ను కొనుగోలు చేయాల‌ని ర‌క్ష‌ణ‌శాఖ నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. ఏకే203 రైఫిళ్ల త‌యారీ కోసం కూడా ర‌ష్యాతో ఒప్పందం కుదుర్చుకున్న‌ది. యుద్ధం స‌మ‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండేందుకు భార‌త్ త‌న ఆయుధ బండాగారాన్ని పెంచుకుంటున్న‌ది. హెచ్ఈ 36 గ్రేనేడ్ల స్థానంలో.. కొత్త గ్రేనేడ్ల‌ను తీసుకురావాల‌ని ఆర్మీ ఆలోచిస్తున్న‌ది. శత్రువుల టార్గెట్ల‌ను పేల్చేందుకు హ్యాండ్ గ్రేనేడ్ల‌ను వాడుతారు. శ‌త్రు బంక‌ర్ల‌ను పేల్చేందుకూ వీటిని వినియోగిస్తారు.

1545
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles