బెంగూళూరులోనే ఏరో ఇండియా షో..

Sat,September 8, 2018 12:24 PM

Defence Ministry confirms Bengaluru will host Aero India show

న్యూఢిల్లీ: ఏరో ఇండియా షో నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 20 నుంచి 24 మధ్య.. ఏరో ఇండియా షోను బెంగుళూర్‌లో నిర్వహించనున్నారు. ఏరో ఇండియా ప్రదర్శనపై గత కొన్నాళ్లుగా వివాదం నెలకొన్నది. ఈ ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ముంద‌కు వ‌చ్చింది. దీంతో ఆ వివాదానికి తెరదించుతూ రక్షణ శాఖ ఇవాళ ఓ స్పష్టమైన సంకేతానిచ్చింది. బెంగుళూరులోని యలహంకా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఏరో ఇండియా షోను నిర్వహించనున్నారు. ఏరో ఇండియా షోలో.. వైమానిక రంగానికి చెందిన రక్షణ శాఖ ఉత్పత్తులను అమ్మడంతో పాటు ఎయిర్ షోలను నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన కంపెనీలతో పాటు పెట్టుబడిదారులు ఈ షోకు హాజరుకానున్నట్లు రక్షణశాఖ మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు.

1189
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles