6.5 లక్షల అజాల్ట్ రైఫిళ్లు వస్తున్నాయి..

Sat,September 1, 2018 09:46 AM

Defence Ministry begins process to acquire 6.5 lakh assault rifles

న్యూఢిల్లీ: భారత ఆర్మీ అమ్ములపొదిలోకి కొత్త రైఫిళ్లు రానున్నాయి. సుమారు 6.5 లక్షల అజాల్ట్ రైఫిళ్లు కొనేందుకు రక్షణ శాఖ చర్యలు చేపట్టింది. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా 7.62 X 39 స్క్వేర్‌ ఎంఎం క్యాలిబర్ అజాల్ట్ రైఫిళ్లను కొనుగోలు చేయనున్నారు. ఈ రైఫిళ్ల రేంజ్ 300 మీటర్లు ఉంటుంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు వీటిని ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం ఆర్మీ వద్ద ఉన్న 8 లక్షల ఇన్సాస్ రైఫిళ్లను మార్చాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అజాల్ట్ రైఫిళ్లను కొనుగోలు చేయనున్నారు. 12వేల కోట్ల మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగాంగా ఈ రైఫిళ్లను తీసుకురానున్నారు.

1464
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles