కార్గిల్ అమ‌ర‌వీరుల‌కు ఘనంగా నివాళి

Tue,July 26, 2016 10:09 AM

Defence Minister, Army Chief pay homage to Kargil war martyrs

ఢిల్లీ : 17వ కార్గిల్ దివ‌స్‌ను ఇవాళ నిర్వ‌హిస్తున్నారు. పాకిస్థాన్‌తో జ‌రిగిన కార్గిల్ యుద్ధంలో మ‌ర‌ణించిన సైనికుల‌కు ఈ సంద‌ర్భంగా నివాళ్లు అర్పించారు. ఢిల్లీలోని అమ‌ర్‌జ‌వాన్ జ్యోతి ద‌గ్గ‌ర ర‌క్ష‌ణ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ నివాళి అర్పించారు. త్రివిధ ద‌ళాధిప‌తులు కూడా వంద‌నం చేశారు. సైనిక ద‌ళాధిప‌తి ద‌ల్బీర్ సుహాగ్‌, నౌకాద‌ళాధిప‌తి సునిల్ లాన్‌బా, వైమానిక ద‌ళాధిప‌తి అరూప్ ర‌హాలు అమ‌ర‌వీరుల‌కు సెల్యూట్ చేశారు. జ‌మ్మూక‌శ్మీర్‌లోని ద్రాస్ సెక్టార్‌లో కూడా కార్గిల్ అమ‌రవీరుల కుటుంబ స‌భ్యులు కూడా నివాళి అర్పించారు. ఆర్మీ ఆఫీస‌ర్లు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.చివ‌ర శ్వాస ఉన్నంత వ‌ర‌కు మాతృదేశం కోసం పోరాడిన ప్ర‌తి వీర సైనికుడికి వంద‌నాలు అర్పిస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేశారు. సైనికుల విరోచిత ప్రాణ త్యాగాలు ప్రేర‌ణ క‌లిగిస్తున్నాయ‌ని మోదీ అన్నారు.
1030
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles