బెంగాల్‌ మినిస్టర్‌ ఇంట్లో కుళ్లిన మృతదేహాలు

Tue,May 28, 2019 12:09 PM

Decomposed Bodies Of Bengal Minister Family Members Found At Home

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ మినిస్టర్‌ మోలోయ్‌ ఘటక్‌ నివాసంలో కుళ్లిన మృతదేహాలు లభ్యమయ్యాయి. అన్సాల్‌ పట్టణంలోని మంత్రి ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు సోమవారం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మంత్రి నివాసానికి చేరుకుని ఇంట్లోకి వెళ్లి చూడగా.. రెండు మృతదేహాలు కనిపించాయి. ఈ ఇద్దరు కూడా మహిళలే. అందులో ఒకరు మినిస్టర్‌ సోదరుడి భార్య కాగా, మరొకరు ఆమె కుమార్తె. మృతులను జయశ్రీ ఘటక్‌, నీలం ఘటక్‌గా పోలీసులు గుర్తించారు. మహిళల మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

5337
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles