అమిత్‌ షా మాట నిలబెట్టుకున్నారు : బెంగాలీ ఎంపీ

Thu,May 30, 2019 04:25 PM

Deboshree Choudhury will be the second minister from Bengal

హైదరాబాద్‌ : ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను అమిత్‌ షా నిలబెట్టుకున్నారని పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్‌ ఎంపీ దేబోశ్రీ చౌదరి పేర్కొన్నారు. తాను కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రాయ్‌గంజ్‌లో ఇటీవల ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అమిత్‌ షా మాట్లాడుతూ.. దేబోశ్రీని గెలిపిస్తే కచ్చితంగా కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం తనకు ఇవాళ కేంద్రమంత్రి వర్గంలో చోటు కల్పించారని దేబోశ్రీ తెలిపారు. అమిత్‌ షా సూచన మేరకు తాను బెంగాలీ భాషలో కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నానని ఆమె చెప్పారు. బెంగాల్‌ నుంచి బాబుల్‌ సుప్రియో కేంద్రమంత్రిగా పని చేయగా, తాజాగా దేబోశ్రీ కూడా కేంద్రమంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

2587
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles