3కి చేరిన మృతులు..కొనసాగుతున్న సహాయక చర్యలు

Wed,March 20, 2019 03:08 PM

Deathtoll rises to 3 in karnataka Building Collapse


బెంగళూరు : ఉత్తర కర్ణాటకలోని ధార్వాడ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న నాలుగంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 3కి చేరింది. ఎన్టీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టి ఇప్పటివరకు 37 మందిని కాపాడాయి. శిథిలాల కింద చిక్కుకున్న మిగతావారిని రక్షించేందుకు ఎన్డీఆర్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. భవన శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారని, వారిలో ఎక్కువ మంది ఉత్తర భారత దేశానికి చెందిన వలస కూలీలేనని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద స్థలంలో అత్యవసర సేవల కోసం అంబులెన్సులు, అగ్నిమాపక దళ వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్వీ దేశ్ పాండే సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ధార్వాడ్‌లోని కుమరేశ్వరనగర్‌లో ఈ ఘోర ప్రమాదం జరిగింది.



1806
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles