సర్వీస్ నుంచి ఐపీఎస్ ఆఫీసర్ తొలగింపు

Thu,February 22, 2018 06:58 PM

Deadwood IPS officer removed from service

న్యూఢిల్లీ: ఆనంద్ కుమార్ తివారి ఐపీఎస్‌ను సర్వీసు నుంచి తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తివారి 1994 బ్యాచ్‌కు చెందిన అస్సాం - మేగాలయ కేడర్ ఆఫీసర్. అసమర్థ పనితనం వలన ఎందుకు ఉద్యోగం నుంచి తొలగించకూడదో తెలపాలంటూ తివారికి నోటీసులు జారీ చేసింది. నోటీసులు తీసుకునేందుకు తివారి నిరాకరించడంతో కేంద్ర హోంమంత్రిత్వశాఖ అతనిపై కమిటీని వేసింది. ఆనంద్‌కుమార్ తివారి తప్పని సరిగా వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకోవాలని కమిటీ తేల్చి చెప్పింది. దానికి తివారి వినకపోవడంతో సర్వీసు నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. గత రెండేళ్లలో సర్వీసు నుంచి తొలగించబడిన ఆరో ఐసీఎస్ ఆఫీసర్‌గా తివారి నిలిచారు.

3701
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles