మీ డెబిట్ కార్డులు మార్చుకున్నారా.. దగ్గర పడుతున్న డెడ్‌లైన్

Tue,December 18, 2018 06:08 PM

Dead line is approaching to replace your Old Debit and Credit cards

న్యూఢిల్లీ: మీ దగ్గరున్న పాత డెబిట్ కార్డులను బ్యాంకుల్లోకి వెళ్లి మార్చుకున్నారా? ఎందుకంటే జనవరి 1 నుంచి పాత కార్డులు పని చేయవు. కేవలం చిప్, పిన్ ఆధారిత యూరోపే, మాస్టర్‌కార్ట్, వీసా (ఈఎంవీ) డెబిట్, క్రెడిట్ కార్డులు మాత్రమే పని చేస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో కస్టమర్లు బ్యాంకులకు క్యూ కడుతున్నారు. డెడ్‌లైన్ దగ్గర పడుతున్నా ఇప్పటివరకు 50 నుంచి 70 శాతం వరకే పాత మాగ్నెటిక్ ైస్ట్రెప్ కార్డులను కస్టమర్లు మార్చుకున్నారు. డిసెంబర్ 31 తర్వాత ఈ కార్డులు చెల్లవని బ్యాంకులు చెప్పినా.. అవి పని చేస్తాయా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఒకవేళ ఆర్బీఐ డెడ్‌లైన్‌ను పొడిగించకపోతే.. బ్యాంకులు తమ దగ్గరున్న కార్డులను పని చేయకుండా చేస్తాయని, కస్టమర్లు బ్యాంకులకు వచ్చి కొత్త వాటి కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రా బ్యాంక్ అధికారి ఒకరు వెల్లడించారు. ఏడాదిలో కనీసం ఒక్కసారైనా కార్డులను వాడిన ఎస్‌బీఐ కస్టమర్లకు కొత్త కార్డులు ఇప్పటికే వచ్చేశాయి. ఏడాదిగా వాడిని వాళ్లు మాత్రం నేరుగా బ్యాంక్‌కు వెళ్లి వాటిని తీసుకోవాల్సి ఉంటుందని ఎస్‌బీఐ సీజీఎం స్వామినాథన్ చెప్పారు. పాత కార్డులైతే డిసెంబర్ 31 తర్వాత పని చేయవని ఆయన స్పష్టం చేశారు. ఈ కొత్త కార్డులకు ఎస్‌బీఐ ఎలాంటి మొత్తం వసూలు చేయడం లేదు కానీ.. కొన్ని ఇతర బ్యాంక్‌లు మాత్రం ఫీజు వసూలు చేస్తున్నాయి.

5387
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles