‘డ్యాన్సింగ్ అంకుల్‌’ ఈ సారి హృతిక్‌ పాటతో..వీడియో

Fri,July 6, 2018 02:09 PM

Dancing uncle is back with hrithik roshan song

బాలీవుడ్ నటుడు గోవిందా ైస్టెల్‌తో డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తాడు సంజీవ్ శ్రీవాత్సవ. ‘డ్యాన్సింగ్ అంకుల్‌’గా పేరు సంపాదించిన సంజీవ్ మరోసారి నెటిజన్ల ముందుకు వచ్చాడు. బాలీవుడ్ స్టార్లలో గోవిందా, హృతిక్ రోషన్ డ్యాన్స్‌కు అభిమానులంతా ఫిదా అవుతారనే విషయం తెలిసిందే. సంజీవ్ శ్రీవాత్సవ ఇపుడు హృతిక్ రోషన్ పాటతో మనముందుకు వచ్చాడు.

హృతిక్ రోషన్ కెరీర్‌లోనే హిట్ ట్రాక్ ‘కహో నా ప్యార్ హై’ పాటకు సంజీవ్ డ్యాన్స్ చేసి అదరహో అనిపిస్తున్నాడు. ఈ డ్యాన్స్ వీడియోను జులై 3న తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేయగా..మూడు రోజుల్లోనే ఆ వీడియోకు 1300 లైకులు రావడం విశేషం. ఈ వీడియోను డ్యాన్సింగ్ దిగ్గజం హృతిక్ రోషన్‌కు అంకితం చేస్తున్నట్లు ట్వీట్ చేశాడు సంజీవ్ శ్రీవాత్సవ.


2741
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS